Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుట్టుమిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కుట్టుమిషన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజు క్రిస్టియన్ మైనార్టీ శాఖ ద్వారా మంజూరైన ఏడు కుట్టు మిషన్లను లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం తెలంగాణ మహిళలను కోటి మందిని కోటీశ్వర్లు గా చేయడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. మహిళ సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి, సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేసీ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వంకే అద్దెకు ఇవ్వాలని చేశారు. దీని ద్వారా మహిళలకి ప్రభుత్వం అద్దే చెల్లిస్తుందని అన్నారు. మహిళలకు మంచి వ్యాపారమని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి తహసిల్దార్, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, జక్రాన్ పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, క్రిస్టియన్ మైనార్టీ శాఖ అధికారులు, లబ్ధిదారు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -