నవతెలంగాణ – ఆత్మకూరు : కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక సమ్మెకు ఆత్మకూరు జర్నలిస్టులు మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణ తో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. సంఘీ భావ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ముదిగిరి ఓదేలు (ప్రజాపక్షం), పోలు రాజేష్ (సాక్షి), సయ్యద్ వలి (నవతెలంగాణ), కందకట్ల రాము (మన ప్రగతి),పెరుమాండ్ల శ్రీనివాస్ (సూర్య), అర్షం మధుకర్ (కదిలించే వార్త) బొడ్డు రాజేందర్ (వాస్తవం) తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల సమ్మెకు జర్నలిస్టుల సంఘీభావం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES