Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలుకార్మిక, ప్రజా సమస్యలు పరిష్కరించాలి    

కార్మిక, ప్రజా సమస్యలు పరిష్కరించాలి    

- Advertisement -

 – హుస్నాబాద్ లో  భారీ కార్మిక, ప్రజా ప్రదర్శన
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులపై భారం మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్లబండి శశిధర్ అన్నారు. బుధవారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లె చెట్టు చౌరస్తా మీద బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తుందని అన్నారు.

కనీస వేతనాల అమలు కాకుండా పని గంటలు పెచ్చిందన్నారు. కార్మికుల శ్రమలను దోచుకునేందుకు  పెట్టుబడుదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక కోడలను తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం  8 నుండి 10 గంటలకుు పెంచుతూ జీవోను జారీ చేసిందని అన్నారు .కార్మికుల శ్రమనుద్దోచుకునే కార్మికకోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని, సంఘటిత సంఘటిత కార్మికులకు 26 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను వెంటనే ఆపాలని అన్నారు.. మున్సిపల్,ఆశ అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు సేమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కాంట్రాక్టర్ ఉద్యోగులు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి కనీస మద్దతు ధర కనిపించాలని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను ఉసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని కూలీలకు దూరం చేసే విధానాలను ఉసంవరించుకొని కూలీలకు రెండు వందల రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కల్లుగీత కార్మికులు, తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నాయకులు గూగులోతు శివరాజ్, బి ఎస్ పి పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్, నాయకులు రాజు,విక్రమ్, సతీష్, రవీందర్, నాయకులు శ్రీకాంత్, సాయిలు, నాగేందర్, రాజయ్య, కొమురయ్య, సంపత్, వెన్నెల,విమల, స్వప్న, స్వరూప, లత, రేణుక, ప్రశాంత,కార్మికులు పాల్గొన్నారు.





- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -