Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసార్వత్రిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ మద్దతు...

సార్వత్రిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ మద్దతు…

- Advertisement -
  • – మద్దతుగా నిరసన ప్రదర్శన
    – నూతన విద్యావిధానం రద్దు చేసి విద్యను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచాలి
    – ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు
    నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) పూర్తి సంఘీభావం, మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకు జరిగిన ప్రదర్శన లో ఎస్ఎఫ్ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్స్ తీసుకుని వచ్చి కార్మికుల హక్కులను కాలరాసే చర్యలకు బిజెపి ప్రభుత్వం పూనుకుంటుందని కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు.

నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్య రంగాని ప్రైవేటు పరం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, విద్యరంగంలో సామాజిక సృహా,విలువలు లేకుండా మూఢనమ్మకాలు, వేదాలు, భూతవైద్యం లాంటి కర్యూక్యూలమ్.తయారు చేస్తున్నారు. యూజీసీ రద్దు చేయడం ,అధికారులు తగ్గించడం., యూజిసిని వాడుకొని మార్గదర్శకాలు పేరుతో ఉన్నత విద్యారంగంపై. దాడి చేస్తోందని అన్నారు. ఎన్.టి.ఎ. రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్.టి.ఎ సంస్థ పరీక్షలు ముందే లీక్ చేస్తోందని అలాగే నీట్ ,నెట్ పేపర్లు గత సంవత్సరం లీక్ అయ్యాయని తెలిపారు. ఎన్.టి.ఎ.ను రద్దుచేయాలని తెలిపారు.

ఉపాధి కల్పన చేయకుండా నిరుద్యోగులను దగా చేశారని. రైల్వే శాఖ లో -3 లక్షలు, డిఫెన్స్ లో 3 లక్షలు, టెలికాం రంగంలో 1 లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం లేదని ,పైగా సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత పదేళ్ల కాలంలో 20 కోట్లు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని. దయ్యబట్టారు. సార్వత్రిక సమ్మెలో లక్షలాది మంది పాల్గొని జయప్రదం చేశారని ఇకనైనా మోదీ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఊపాధ్యక్షులు దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత,రాష్ట్ర కమిటీ సభ్యులు స్టాలిన్, రమేష్ ,హైదరాబాద్ జిల్లా అధక్ష్య, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -