దేవదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన దామేరకుంటవాసి
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం మండలంలోని దామరకుంట గ్రామంలో గల భక్తాంజనేయ స్వామి ఆలయంలో అన్ని అర్హతలు గల తనకే ధూపదీప నైవేద్య సేవకు అవకాశాన్ని కల్పించాలని ఇదే గ్రామానికి చెందిన కట్ట సురేష్ బాబు కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం దేవాదాయ శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారిని ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. అందుకు సంబంధించిన వివరాలను పత్రిక ప్రకటన రూపేనా విడుదల చేశారు. గ్రామానికి చెందిన ఎలాంటి అర్హత లేని ఓ వ్యక్తి ధూపదీప నైవేద్యానికి దరఖాస్తు చేసుకొని అతనికి సంబంధించిన బంధువుని ఆలయంలో ఉంచి లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.
తన చిన్ననాటి నుంచే అట్టి ఆలయంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు గత ఏడాది ధర్మ జాగరణ విభాగంలో విద్యను అభ్యసించి ఉన్నట్లు తెలిపారు అలాగే, త్యాగరాజు మ్యూజిక్ కళాశాల నందు తబల కూడా నేర్చుకున్నానని ఉదయం ధూప దీపాన్ని సమర్పించడంతోపాటు సాయంకాలం వేల భజన కార్యక్రమంలో భాగంగా తానే స్వయంగా తభల కొడుతున్నట్లు వెల్లడించారు. ఇట్టి విషయంలో సమగ్ర విచారణ జరిపించి తనకు అవకాశం కల్పించాలని ఆయన దేవదాయ శాఖ కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో స్పష్టం చేశారు.
నైవేద్య సేవకు నాకే అవకాశం ఇవ్వాలి.!
- Advertisement -
- Advertisement -