నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోదండరామ్ ను తెలంగాణ జన సమితి ముధోల్ ఇంచార్జి సర్థార్ వినోద్ కుమార్, బాసర మాజీ సర్పంచ్ మమ్మయి రమేష్ లు కోరారు. హైదరాబాద్ లోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ని బుధవారం రోజు కలిసి సన్మానించారు. ఆనంతరం ట్రిపుల్ ఐటీలో నెలకోన్న సమస్యలను వివరించారు. పది సంవత్సరాలుగా ట్రిపుల్ ఐటీలో కోట్లాది రూపాయల అవినీతి చోటు చేసుకుందని వారు ఆరోపించారు. విద్యార్థులకు సరైన భోజనం తో పాటు, ట్రిపుల్ ఐటీ మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. ట్రిపుల్ ఐటీ సమస్యలపై ఎమ్మెల్సీ స్పందించినట్లు వారు తెలిపారు. సమస్యలపై చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
ట్రిపుల్ ఐటీ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES