Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

- Advertisement -

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్
నవతెలంగాణ – తుర్కపల్లి
: కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త సారత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు తుర్కపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపైన రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బ్రిటిష్ వారిపై సైతం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను కార్పొరేట్ ల ప్రయోజనం కోసం తీసుకువచ్చిందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కొక్కొండ లింగయ్య, సిఐటియు మండల కన్వీనర్ తూటి వెంకటేశం, జిల్లా సిఐటియు నాయకులు గడ్డమీది నరసింహ, మహిళా సంఘం మండల కార్యదర్శి ఆవుల కలమ్మ, ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా నాయకులు గుండెబోయిన బలరాం, గుండెబోయిన వీరేశం, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, గ్రామపంచాయతీ రంగం నాయకులు బాచ్య నాయక్, దన్సింగ్, చాగ బిక్షపతి, గడిపే లక్ష్మి, సుశీల, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -