Thursday, July 10, 2025
E-PAPER
Homeఖమ్మంఆయిల్ ఫెడ్ కు టోల్ ఫ్రీ నంబర్ 8143021010 

ఆయిల్ ఫెడ్ కు టోల్ ఫ్రీ నంబర్ 8143021010 

- Advertisement -

రైతుల హర్షం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పామాయిల్ సాగు దారుల సౌకర్యార్థం ఆయిల్ ఫెడ్ కు టోల్ ఫ్రీ నంబర్ 8143021010 ఏర్పాటు చేసినట్లు ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం ప్రకటించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రము లో  పామాయిల్ సాగుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని  ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ, ఇతర ప్రోత్సహలు తో పామాయిల్ విస్తరణకు, పెంపుకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఈ విధాన నిర్ణయం చేసినట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ పరిధిలో ని(భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, గద్వాల్, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ పేట్, సిద్దిపేట, యదాద్రి భువనగిరి) జిల్లాల పరిధి  లోని పామాయిల్ సాగు విస్తరణ కోసం అవగాహనా, సాగులో వచ్చే సమస్యల పై పరిష్కారాలకోసం, ఆయిల్ ఫెడ్ ద్వారా పరిష్కారం అయ్యే సమస్యలపై  పామాయిల్ రైతుల సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ కేటాయింపు జరిగింది అన్నారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ పరిధిలోని పామాయిల్ రైతులు తమ సమస్యలు,సందేహాలు ఉంటే ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 8143021010 కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయడం ద్వారా, వాట్సాప్ ద్వారా సమస్యలను ఫిర్యాదులు రూపంలో తెలియ పరిష్కారం కోసం ఆయిల్ ఫెడ్ తగు చర్యలు తీసుకుంటుంది అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -