Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో నిరసన తెలిపిన సీపీఐ(ఎం)

గ్రామాల్లో నిరసన తెలిపిన సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక కర్షక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చారు. మండలంలోని చీమల కొండూరు, పెంచికల్ పహాడ్ ,నందనం, గ్రామాలలో ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో గ్రామీణ నిరసనలు తెలిపారు. 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రజలపై భారాలు మోపి ఇబ్బంది పెడుతున్నది. అదేవిధంగా చట్టంలో ఉన్న 44 లేబర్ కోడ్లను 4గా..సవరణ చేసి కార్మికులకు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితి మెరుగుపడుతున్న దశలో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది. అందులో భాగంగా మోడీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కోత విధించినది అదేవిధంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో 10 గంటల పనిని అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి వారికి ఈఎస్ఐ పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సిలువేరే ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షులు బోడ ఆంజనేయులు ప్రజానాట్యమండలి మండల అధ్యక్షురాలు కొల్లూరు శ్రావణి, రైతులు మంగ మల్లేష్ జీడికపల్లి ఎల్లయ్య బిక్షపతి రావుల అంజయ్య మల్లేష్ కొల్లూరి సిద్దిరాజు ఇక్కిరి సోములు మారాను ప్రభాకర్ వ్యవసాయ కార్మికులు పల్లెర్ల పోచయ్య మంగ పాండు సిహెచ్ సత్యనారాయణ గోపి సాయిలు బి సుభాష్ జే ఐలయ్య టి రాజు కే మల్లేష్ వి యాదయ్య వీ రాంబాబు ,నాగులు, చంద్రయ్య సుగుణమ్మ ,ఎల్లమ్మ,పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -