నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం సికింద్రాబాద్ ఎల్‌ఐసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ లోని అతిపెద్ద క్లాస్-3వ, 4వ ఉద్యోగుల సంఘం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఇయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. గాంధీనగర్ లోని ఎల్‌ఐసీ డివిజనల్ ఆఫీస్ ప్రాంగణంలో దాదాపు వందలాది మంది ఉద్యోగులు పట్టణ ప్రాంతంలోని వివిధ ఎల్‌ఐసీ కార్యాలయాల నుంచి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ సీజడ్‌ఐఇఎఫ్ అధ్యక్షులు పి. సతీష్, సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, సహ కోశాధికారి రాజేష్ సింగ్ హాజరయ్యారు. ఈ సమ్మెను ఉద్దేశించి పి.సతీష్ మాట్లాడుతూ ఎల్‌ఐసీలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలనీ, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించాలనీ, జీవిత బీమా, హెల్త్ బీమా రంగంలో పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో ఐసీఇయూ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ గుణశేఖర్, డి.ఎస్.రఘు, కార్యవర్గ సభ్యులు బి.ప్రభాకర్, హెచ్.ఎస్. చంద్రశేఖర్, వివేక్ కౌశిక్, జావేద్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
సమ్మెలో ఎల్‌ఐసీ ఉద్యోగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES