Thursday, July 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుయూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు

- Advertisement -

తాడ్వాయిలో పోలీస్‌ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. వీరికి పోలీసు బందోబస్తు మధ్య ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు. చిన్నపాటి తగాదాలు రావొద్దనే ఉద్దేశంతో స్థానిక పోలీసులు పహారా చేపట్టారు. మండలంలో ఇప్పటివరకు 1258 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేశామనీ.. గతేడాది ఈ సమయానికి 1150 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయగా.. ఈ యేడు ఇదే సమయానికి 88 మెట్రిక్‌ టన్నుల యూరియా అదనంగా సరఫరా చేసినట్టు మండల వ్యవసాయాధికారి నరసింహులు తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా ఉన్నదని అయితే రైతులు ఖరీఫ్‌కు కావాల్సిన మేరకే కొనుగోలు చేయాలని.. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులకు గురికావొద్దని ఆయన రైతులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -