Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడే తెలంగాణ మంత్రివర్గ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ!

నేడే తెలంగాణ మంత్రివర్గ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష చేయడం ప్రధాన అజెండాగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు అనేక మంత్రివర్గ భేటీలు జరగగా.. అందులో తీసుకున్న నిర్ణయాలు ఎన్ని అమలయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అన్న అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనున్నట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై కూడా క్లారిటీ వచ్చే సూచనలు ఉన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే ఈ భేటీలో అమలుకాని, ఆలస్యమైన నిర్ణయాలకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే దిశగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను రూపొందించనున్నారు. మంత్రుల దగ్గరి నుంచి అధికారుల వరకూ ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, ఆ వివరాలపై పూర్తి సమీక్ష జరగనుంది. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, ఉద్యోగాల భర్తీ, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, గోశాలల నిర్మాణం, మహిళల సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గత క్యాబినెట్ భేటీలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశాన్ని “స్టేటస్ రిపోర్ట్ మీటింగ్”గా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో.. ఈ రోజు సమావేశంలో ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌’ను సమర్పించి చర్చించే అవకాశం కనపడుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -