నవతెలంగాణ – కామారెడ్డి: ఎవరైనా తమ పుట్టినరోజు, పండగలు లేదా ఏదైనా ఇతర అకేషన్లలో బాలసదనం బాలలతో గడపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజలకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల బాల సదన్ ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలసదనంలో ఉన్న వసతులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. పిల్లలతో మాట్లాడి సౌకర్యాలు కనుక్కున్నారు. వారికి దుప్పట్లను అందించారు. అందరూ మంచిగా చదువుకోవాలని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు.
జిల్లా అధికారుల సంక్షేమ సంఘం నుండి వర్షాకాలం దృష్ట్యా పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దాతలు ఎవరైనా వారి పుట్టినరోజులకు, పండగలకు లేదా ముఖ్యమైన రోజులలో బాలసదనంకు వచ్చి పిల్లలతో సమయం గడపి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. కొత్త భవనం యొక్క కన్స్ట్రక్షన్ గురించి కాంట్రాక్టర్ తో, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, సుపరిండెంట్ సంగమేశ్వరి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు తమ స్పెషల్ అకేషన్లను బాలసదనం పిల్లలతో జరుపుకోవాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES