నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని చౌట్ పల్లి, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటు పొందిన విద్యార్థులను మండల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గురువారం ఆయా పాఠశాలలను సందర్శించిన లయన్స్ క్లబ్ సభ్యులు బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు పొందిన విద్యార్థులను అభినందించారు. చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసరలో సీట్లు సాధించారు. విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలుపుతూ శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తద్వారా కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు
కార్యక్రమంలో మండల లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సున్నo మోహన్, నోముల నరేందర్, ప్రధాన కార్యదర్శి నలిమెల గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, సభ్యులు బద్దం రాజశేఖర్, లింగారెడ్డి, అనిల్, లింగారెడ్డి, చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.