Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలుపోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.!

పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.!

- Advertisement -

డబ్బు వద్దు… న్యాయం కావాలి 
గంగమ్మ ఆవేదన 
నవతెలంగాణ – నకిరేకల్ 
: వినడానికి విచిత్రంగా ఉంది కదూ..! కోడిని కర్రతో కొట్టిన పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పంచాయతీ ఎందుకూ.. డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు అడిగినా.. డబ్బు వద్దు.. న్యాయం కావాలి.. నా కోడిని కొట్టిన వారికి శిక్ష పడాలంటూ వృద్ధురాలు ఆవేదనతో చెప్పింది.

వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు కోడిని పెంచుకుంటుంది. ప్రతిరోజు బయట మేతమేసి ఇంటికి చేరే కోడిని ఇంటి పక్కనే ఉన్న రాకేష్ అనే వ్యక్తి తన గడ్డి వాములో గింజలు తింటుందన్న కారణంతో కర్రతో ఆ కోడిని కొట్టాడు. దీంతో ఆ కోడి కాలు విరిగింది. అది చూసిన గంగమ్మ  నా కోడిని కొట్టిన రాకేష్ కు శిక్ష పడాల్సిందే. నాకు డబ్బు వద్దు.. కేసు నమోదు చేయండి అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -