Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుAdulterated Toffee: కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

Adulterated Toffee: కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న కుకట్ పల్లి కల్తీ కల్లు బాధితులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ కల్తీ కల్లు తాగి ఇంత మంది ఆసుపత్రి బారిన పడడానికి ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంమే కారణం అన్నారు.

కల్తీ కల్లు అమ్ముతున్న వారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న సిగాచి ఘటనలో 40 మందికి పైగా మృతిచెందారు. ఇప్పుడు కల్తీ కల్లు కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అన్ని ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కానీ పడుతోందన్నారు.

కల్తీ కల్లు ఘటనలో దాదాపు వెయ్యి మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఆసుపత్రికి రాకుండా ఇంకా చాలా మంది ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్నారు. అనధికారికంగా ఆరుగురు కంటే ఎక్కువే మరణించినట్టు వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేయించి …నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -