నవతెలంగాణ – జుక్కల్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలు మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల బూత్ లెవెల్ ఆఫీసర్ కు గురువారం మండల కేంద్రంలో రైతు వేదిక కార్యాలయంలో జుక్కల్ తాహసిల్దార్ పీ .మారుతి డిప్యూటీ తహసిల్దార్ హేమలత, ఆర్ఐ రామ్ పటేల్ , పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మారుతీ మాట్లాడుతూ .. మండలంలోని అన్ని గ్రామాల బిఎన్ఓ లకు శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని దేశ , రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బిఎల్ఓ లు సన్నద్ధం కావాలని సూచించారు. ఇందులో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రముఖ పాత్ర ఉంటుందని అన్నారు. గ్రామాలలో అర్హులైన యువకులు ఉంటే వారిని ఎన్నికల గుర్తింపు కార్డులు వచ్చే విధంగా అవగాహన చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు సూపర్ వైజర్, మండలంలోని అన్ని గ్రామాల బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
ఈసీ ఆధ్వర్యంలో బిఎల్ఓ లకు శిక్షణా తరగతులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES