Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయవాది శ్యామ్ బాబుకు ఘన సన్మానం

న్యాయవాది శ్యామ్ బాబుకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : ప్రఖ్యాత న్యాయవాది శ్యామ్ బాబు కి ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ పదవి లభించిన సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్సీ జిల్లా కార్యదర్శి బోడ.అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం లు ప్రత్యేకంగా హాజరై, శ్యామ్ బాబు కి శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..శ్యామ్ బాబు విద్యార్థి ఉద్యమం నుండే ప్రజల సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారు. విద్యార్థి సంఘాల్లో పనిచేసిన అనుభవాన్ని నేడు న్యాయవాద వృత్తిలోనూ కొనసాగిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. ఆయనకు ఈ పదవి రావడం ఆనందంగా ఉంది. ఇలాగే ప్రజాసేవలో ముందుండాలని, మరిన్ని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాంఅని తెలిపారు. కార్యక్రమంలో ఏఐపీఎస్సీ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మైపాల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -