Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలుగౌని అంజన్న ఆశయాలను కొనసాగిస్తాం..

గౌని అంజన్న ఆశయాలను కొనసాగిస్తాం..

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ 
భౌతికాయంపై ఎర్రగుడ్డ కప్పి నివాళులు అర్పించిన సీపీఐ(ఎం) నేతలు 
నవతెలంగాణ – తాడ్వాయి  

మండల కేంద్రంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు గౌని అంజన్న గురువారం అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి లు ఎర్రగుడ్డ కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాడ్వాయి మండల కేంద్రంలో సీపీఐ(ఎం) బలోపేతానికి అంజన్న ఎనలేని కృషి చేశాడని, ఆయన సేవలు మరువలేని అని కొనియాడారు.

అంతే కాకుండా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ గీత కార్మిక సంఘంలో ప్రముఖ పాత్ర పోషించి, గీత కార్మికులకు కూడా అండగా నిలబడ్డారని ఆయన లేని లోటు పుడ్చలేమని ఆయన ఆశయం కొరకు నేటి యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పొదిలి చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, గొంది రాజేష్, మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి, దాసరి కృష్ణ, చింతల కొమురయ్య, శంకర్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పంజాల శీను, పులి నరసయ్య గౌడ్,తమ్మల సమ్మయ్య గౌడ్, రంగు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -