Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం542 అడుగులకు పెరిగిన సాగర్‌ నీటిమట్టం

542 అడుగులకు పెరిగిన సాగర్‌ నీటిమట్టం

- Advertisement -
  • శ్రీశైలం నుంచి వస్తున్న వరద
    నవ తెలంగాణ- నాగార్జునసాగర్‌

    శ్రీశైలం నుంచి వరద ప్రభావం కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్‌ జలాశయం నీటిమట్టం 542 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 1,16,833 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 1,70,114 క్యూసెక్కులు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి క్రెస్ట్‌ గేట్ల ద్వారా 80100 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 29, 342 క్యూసెక్కులు, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 51883 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాగార్జునసాగర్‌కు 3 రోజులుగా రోజుకు 10 టీఎంసీల నీరు వస్తోంది. దీంతో సాగర్‌ జలాశయం సగటున రోజుకు ఐదు అడుగుల చొప్పున పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి సాగర్‌ డ్యామ్‌ గేట్లను నీరు తాకనుంది. సాగర్‌ ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 3202క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -