Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆల్ట్రోజోలం మత్తు మందుతో కల్లు కల్తీ

ఆల్ట్రోజోలం మత్తు మందుతో కల్లు కల్తీ

- Advertisement -

– నలుగురు అరెస్ట్‌
– పలు దుకాణాల లైసెన్స్‌ సస్పెండ్‌
– కల్తీకల్లు ఘటనలో మరో మహిళ మృతి
నవతెలంగాణ-కూకట్‌పల్లి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిసరాల్లో కల్లు దుకాణాల్లోని కల్లులో ‘ఆల్ట్రోజోలం’ మత్తు పదార్థం కలిసినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పలు దుకాణాల లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశారు. కాగా, కల్తీ కల్లు ఘటనలో గురువారం మరో మహిళ మృతిచెందింది. కల్తీ కల్లు కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్న ఘటనలపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మూడ్రోజులుగా ఆస్పత్రుల్లో బాధితులు చేరుతుండటంతో అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి బాలానగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. హైదర్‌నగర్‌, హెచ్‌ఎంటీ సాయి చరణ్‌ కాలనీ, సర్దార్‌ పటేల్‌ నగర్‌, భాగ్యనగర్‌ కాలనీల్లోని కల్లు దుకాణాల నుంచి శాంపిళ్లు సేకరించి నారాయణగూడ రసాయన పరీక్షశాలకు పంపారు. భాగ్యనగర్‌ దుకాణం మినహా మిగిలిన వాటిలో ‘ఆల్ట్రోజోలం’ అనే మత్తు పదార్థం ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులు కేసు నమోదు చేసి, దుకాణ యజమానులు కూన రవితేజగౌడ్‌, కూన సాయిలేఖ గౌడ్‌, కల్లు విక్రేతలు చెట్టుకింది నాగేష్‌ గౌడ్‌, బట్టి శ్రీనివాస్‌ గౌడ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిపుణుల నివేదిక ఆధారంగా బాలానగర్‌ ఎక్సైజ్‌ పరిధిలోని హైదర్‌నగర్‌, హెచ్‌ఎంటీ కాలనీ (శంషిగూడ), సర్దార్‌ పటేల్‌నగర్‌ కల్లు దుకాణాల లైసెన్సులను జిల్లా ఎక్సైజ్‌ అధికారి సస్పెండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -