Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం 

పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ 
నవతెలంగాణ – పరకాల 
: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కళ నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలోని పలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులందరికి నిలువ నీడను కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందన్నారు.పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం దశలవారీగా నెరవేరుస్తుందని ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు.

నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే కుటుంబా లు బాగుంటాయని అన్నారు.రేకులు, పైకప్పులు లేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ బేస్మెంట్ కట్టుకున్న వారికి లక్ష రూపాయలు,లెంటల్ లెవెల్ వరకు నిర్మించుకున్న వారికి మరో లక్ష రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఈ విధంగా మొత్తంగా ప్రతి ఇంటికి ఐదు లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక, ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ పడుతుందన్నారు. ప్రతి పేద ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.ఈ

కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, స్థానిక మాజీ కౌన్సిలర్, సమన్వయ కమిటీ నాయకులు మడికొండ సంపత్ కుమార్, డాక్టర్. మడికొండ శ్రీను, మెరుగు శ్రీశైలం గౌడ్, చందుపట్ల రాఘవరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఒంటెరు శ్రావణ్, నాయకులు మేకల వినయ్, బండారి రాజు, బొచ్చు జయాకర్ జాన్సన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డ్ ఆఫీసర్, వార్డులోని పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -