నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస మూర్తి పిఆర్ టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా నియామకమయ్యారు. ఈ మేరకు శ్రీనివాస మూర్తిని పిఆర్ టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా నియమిస్తూ రాష్ట్ర శాఖ ఆదేశాలు జారీ చేసిందని మండల శాఖ అధ్యక్షులు చంద్ర శేఖర్ తెలిపారు. శుక్రవారం హాస కొత్తూర్ పాఠశాలకు వెళ్లిన సంఘ ప్రతినిధులు శ్రీనివాసమూర్తికి నియామక పత్రం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. సంఘ అభివృద్ధికి చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని శ్రీనివాసమూర్తికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా నియమించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్ టియు మండల కార్యదర్శి అంజాద్ సుల్తాన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్, ఉపాధ్యాయులు షేక్ జాన్ పాషా, రాంపాల్, మాధురి, జయంతి, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా శ్రీనివాసమూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES