మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవంగర : లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి తొర్రూరు సంస్థ ప్రతినిధులు నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. సేవా తరుణి ఆధ్వర్యంలో గుండా సోమయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్, కుమార్తె మంజుల ఇరువురు కలిసి కొరిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ప్లేట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో, సేవా తరుణి ప్రెసిడెంట్ శ్రీదేవి రెడ్డి తో కలిసి ఎంఈవో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు దాతల సహకారం ఎంతో అవసరం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉచిత విద్యా, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మన ఊరు -మన పాఠశాలను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు.
సేవా తరుణి కార్యక్రమాలు అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES