- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల : మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో శుక్రవారం వ్యవసాయ అధికారులు ప్రత్తి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రత్తిలో రసం పీల్చే పురుగుల ప్రభావం అధికంగా కనిపిస్తున్నదన్నారు. పురుగుల నియంత్రణకు ఎసిఫెట్ 320 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 300 మి.లీ ని ఒక్క ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. రమేష్, ఏఈఓ పి. రాగసంధ్య, రైతులు మంగ రేణయ్య, మంగ వెంకటమ్మ, పానుగంటి హుస్సేన్, కాల్వ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -