– విద్యార్థులు వినియోగించుకోవాలి- ప్రిన్సిపల్ కోటి రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 14న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం కోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐటిఐ పాసైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఈ మేళాలో హైదరాబాద్కు చెందిన వరుణ్ మోటార్స్, ప్రీమియర్ ఎనర్గిస్ ప్రైవేట్ లిమిటెడ్, నిజామాబాద్ కు చెందిన సుక్జిత్ స్టార్స్ మిల్స్ కంపెనీ, సారంగాపూర్ కు చెందిన ఎవరెస్ట్ స్కేలుస్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ ద్వారా వారి కంపెనీలకు సెలెక్ట్ చేసుకుంటారని తెలిపారు. వివిధ ఐటిఐ ట్రేడ్స్ లో పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కోటి రెడ్డి కోరారు. ఇతర వివరాల కోసం 9491566890, 8106794500 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
బషీరాబాద్ ఐఐటీలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES