కొయ్యుర్ రేంజర్ రాజేశ్వరరావు
నవతెలంగాణ – మల్హర్ రావు : మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందని కొయ్యుర్ పారెస్ట్ రేంజర్ రాజేశ్వర్ రావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మండల ఎంపిడిఓ శ్రీనివాస్, తహశీల్దార్ రవికుమార్ లతో కలిసి మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. పరిశుభ్రత, పచ్చదనంపై విద్యార్థులకు అవగాన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మానవుల మనుగడ కోసం, పచ్చదనం, పరిశుభ్రత వెలిసేలా మొక్కలు నాటలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్, సెక్షన్, బిట్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES