Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపక్కా కమర్షియల్‌గా'కేడీ ది డెవిల్‌'

పక్కా కమర్షియల్‌గా’కేడీ ది డెవిల్‌’

- Advertisement -

ధవ సర్జా హీరోగా కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై వెంకట్‌ కె.నారాయణ నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్‌’. ఈ సినిమాను ప్రేమ్‌ తెరకెక్కించారు. ఈ మూవీలో ధవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు. సంజరు దత్‌, శిల్పా శెట్టి, నోరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. సంజరు దత్‌ మాట్లాడుతూ, ‘నేను ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ సినిమాకు పని చేస్తున్నాను. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ వెంకీ, సుప్రిత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌ ఉంది. అందుకే ఇలాంటి మూవీని ఇంత గొప్పగా నిర్మించగలిగారు. డైరెక్టర్‌ ప్రేమ్‌ చాలా మంచి వ్యక్తి. ధవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని అన్నారు.
‘నాకు సంజరు దత్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. మా మూవీ త్వరలోనే రాబోతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని హీరో ధవ సర్జా చెప్పారు.
దర్శకుడు ప్రేమ్‌ మాట్లాడుతూ, ‘టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే నాకు మాటలు రావడం లేదు. నేను ‘జోగి’ అని కన్నడలో తీస్తే తెలుగులో ‘యోగి’ సినిమాగా చేశారు. ఇప్పుడు ఈ చిత్రంతో రాబోతోన్నాను. టీజర్‌ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. కాళిదాసు పాత్రలో ఎంతో ఎమోషన్‌ ఉంటుంది. ధవ ఈ కారెక్టర్‌ను అద్భుతంగా పోషించారు. ఈ మూవీ ఆడియెన్స్‌ రైట్స్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది’ అని తెలిపారు.
‘హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో ‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమాను చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు. సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్‌ ప్రేమ్‌కి థ్యాంక్స్‌. సంజరు దత్‌తో నేను చేసిన ప్రతీ సినిమా హిట్‌ అయింది. అదే ట్రెండ్‌ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్‌ అంశాలున్నాయి’ అని శిల్పాశెట్టి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -