- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో తపాలా సేవలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖలోని పథకాలు, వడ్డీ వివరాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ సుజిత్ కుమార్, తపాలా పర్యవేక్షకులు వెంకటరామిరెడ్డి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ స్వామి, పంచాయతీ కార్యదర్శి మౌనిక, తపాలా సిబ్బంది సిద్ధరాములు, రచన, సుజాత, వెన్నెల, రాకేష్, అర్జున్, రోహన్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -