- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు బోనాలను పట్టణ కేంద్రంలోని మహంకాళి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా డప్పు చప్పుళ్ళు, విద్యార్థుల పోతరాజుల వేషధారణలతో తీసుకెళ్లారు. ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ సాంప్రదాయ పండుగలను, ఆచారాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మోహన్ గౌడ్, రవి, బాబు, కల్పన, వాసంతి, శైలజ, స్వర్ణలత, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -