నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ యంత్రాంగం కల్లు నిర్వాహకులపై గట్టి నిఘా పెట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ అదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లతో పలు అంశాలపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కల్లు కంపౌండ్ల నిర్వాహణ, కల్లు వినియోగం, అమ్మకాల్లో జరుగుతున్న తప్పిదాలపై ఎప్పటికప్పుడు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని అదేశించారు.ఇందికు సంబంధించి నిర్లక్ష్యంతో నిర్లక్ష్యంతో వ్యవహరించటం వల్ల బాలనగర్ ఎస్‌హెచ్‌ఓ పై సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. ఎక్సైజ్ క్రైమ్‌పై కూడా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యంత్రాంగం దాడులను ముమ్మరం చేసి నాటు సారాను, కల్తీ కల్లును అరికట్టాలని సూచించారు.సమావేశంలో కమిషనర్‌తోపాటు అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేష,ి హైదారాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ డిప్యూటి కమిషనర్లు అనిల్‌కుమార్ రెడ్డి, పి.దశరథ్, ఏ.శ్రీనివాసరెడ్డి, వి.సోమిరెడ్డి, ఖమ్మం, మెదక్ అసిస్టెంట్ కమిషనర్లు జి .గణేష్, జి .శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఫొర్స్‌మెంట్ నుంచి ప్రణవీ పాల్గొన్నారు.
కల్లు దుకాణ నిర్వాహకులపై గట్టి నిఘా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES