Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు ఎప్‌సెట్‌ మాక్‌ సీట్ల కేటాయింపు

రేపు ఎప్‌సెట్‌ మాక్‌ సీట్ల కేటాయింపు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎప్‌సెట్‌ (ఎంసెట్‌) తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు గురువారంతో ముగిసింది. ఈ మేరకు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 94,059 మంది అభ్యర్థులు 56,63,308 వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. ఆదివారం మాక్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -