– కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఘటన
నవతెలంగాణ-బిచ్కుంద
రోడ్డు పక్కన పడేసిన నవజాతి శిశువును గమనించి కాపాడి సీడీపీవోకు తరలించిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో శుక్రవారం జరిగింది. బిచ్చుంద మండలం పెద్ద దేవాడ గ్రామ శివారులోని బాన్సువాడకు వెళ్ళే ప్రధాన రోడ్డు బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన పడేసిన నవజాతి శిశువును బిచ్కుంద కానిస్టేబుల్ యాదగిరి గమనించారు. కానిస్టేబుల్ హుటాహుటిన శిశువును పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య సెంటర్‌కు తరలించి.. మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీడీపీవోకి సమాచారం అందించి శిశువును బాల సంరక్షణ కేంద్రానికి పంపినట్టు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, పసికందును కాపాడిన కానిస్టేబుల్‌ను ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.
రోడ్డు పక్కన పసికందు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES