- Advertisement -
– బాధ్యతలు చేపట్టనున్న తొలిసారి మహిళ
న్యూఢిల్లీ : దిగ్గజ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) బాధ్యతలను తొలిసారి మహిళకు అప్పగించారు. ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రియా నాయర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఆమె నియామకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుందని ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం సీఈఓ ఉన్న రోహిత్ జావా జులై 31తో తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. ప్రియా నాయర్‌కు దాదాపుగా 30 ఏండ్ల నుంచి హెచ్‌యూఎల్‌లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.
- Advertisement -