- Advertisement -
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మే 18న జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ఈ సహాయాన్ని విడుదల చేస్తూ రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అగ్ని ప్రమాదంలో 21 మంది చిక్కుకోగా నలుగురు మాత్రమే బయటపడ్డారు.
- Advertisement -