Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంమే 9,10 తేదీల్లోగ్రామీణ కార్మిక మహిళల జాతీయ సదస్సు

మే 9,10 తేదీల్లోగ్రామీణ కార్మిక మహిళల జాతీయ సదస్సు

– ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్‌ : ఏఐఏడబ్య్లూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

వ్యవసాయ కార్మికుల సమస్యలు, గ్రామీణ ఉపాధి మహిళల స్థితిగతులపై వచ్చేనెల 9,10 తేదీల్లో కేరళలోని మల్లాపురంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్య్లూయూ) ఆధ్వర్యంలో ‘జాతీయ సదస్సు’ను నిర్వహిస్తున్నామని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మంగళవారం కర్నాటకలోని గుల్బర్గాలో నిర్వహించిన గ్రామీణ ఉపాధి కార్మిక మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. మల్లాపురంలో జరిగే జాతీయ సదస్సులో కేరళ సీఎం పినరయి విజయన్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందాకరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు వాసుకి, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ మధుర స్వామినాథన్‌ హాజరై ప్రసంగించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగం, గ్రామీణ ఉపాధిలో మహిళల పాత్ర రోజు రోజుకూ పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మికుల్లో 60శాతం నుంచి 70 శాతం వరకు మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. వారికి సమాన వేతనం, భూమిపై హక్కులు లభించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు గ్రామీణ, ధనిక వర్గాలకు అనుకూలంగా ఉండటంతో మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరుతో భూపట్టాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందడం లేదనీ, మద్యం వల్ల మహిళల జీవితాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. పేద మహిళలపై వైద్య ఖర్చుల భారం పెరిగిందనీ, దాంతో వారు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల వివక్ష మరింత పెరిగిందని విమర్శించారు. మహిళా కూలీలపై లైంగికదాడులకు పాల్పడుతున్న దుండగులకు ఆయా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో హిందుత్వ, మనువాద భావజాలాన్ని కూలీ మహిళల మధ్య వ్యాపింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ పేద మహిళలను సమీకరించడం ద్వారా నూతన ధనిక వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సదస్సులో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు మంగమ్మ, సావిత్రమ్మ, శేఖమ్మ, చంద్రప్ప, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img