Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహేశ్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ 22 శాతం..

మహేశ్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ 22 శాతం..

- Advertisement -

– 2024-25లో రూ.70 కోట్ల లాభాలు
నవతెలంగాణ – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో తన వాటాదారులకు 22 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. గడిచిన ఏడాదిలో ఈ సంస్థ పన్నులు చెల్లించక ముందు రూ.69.98 కోట్ల రికార్డ్‌ లాభాలను నమోదు చేయగా.. పన్నులు చెల్లించన తర్వాత రూ.53.61 కోట్ల నికర లాభాలు సాధించింది. బంజారాహిల్స్‌లోని ఆ బ్యాంక్‌ హెడ్‌ ఆఫీసులో 49వ వార్షిక సాధారణ సభ్య సమావేశం జరిగింది. ఆ బ్యాంక్‌కు హైకోర్టు నుంచి స్పేషల్‌ ఆఫీసర్‌గా నియమితులైన రామ్‌ నారాయణ బోగ విచ్చేసి మాట్లాడుతూ.. భవిష్యత్తులను బ్యాంక్‌ వ్యాపారం మరింత పెరగాలని సూచించారు. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు రూ.48.58 కోట్ల నుంచి రూ.38.68 కోట్లకు తగ్గాయి. దీంతో స్థూల ఎన్‌పీఏలు 4.52 శాతంగా ఉండగా.. నికర ఎన్‌పీఏలు సున్నా శాతంగా నమోదయ్యాయి. బ్యాంక్‌ ఛైర్మన్‌ రమేష్‌ కుమార్‌ బంగ్‌ మాట్లాడుతూ.. 2025-26లో రూ.3,175 కోట్ల వ్యాపారాన్ని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతమున్న బ్యాంక్‌ శాఖలను 45 నుంచి 50కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. ఈ సమావేశానికి ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ వి అర్వింద్‌, వైస్‌ చైర్మెన్‌ లక్ష్మీ నారాయన్‌ రతి, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -