Sunday, July 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం14నుంచి డీసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

14నుంచి డీసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

- Advertisement -


16న వెబ్‌ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

డిప్లొమ ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమ ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ)లో 2025-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 14 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు డీసెట్‌ కన్వీనర్‌, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ జి రమేష్‌ శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. డీసెట్‌ మొదటి, రెండు విడతల్లో సీట్లు భర్తీ కాకుండా ఉన్న వాటిని భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 14,15 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వివరించారు. ఈనెల 16న వెబ్‌ఆప్షన్ల నమోదుకు గడువుందని తెలిపారు. ఈ నెల 19న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ట్యూషన్‌ ఫీజును చెల్లించి ఈనెల 20 నుంచి 22 వరకు అలాట్‌మెంట్‌ ఆర్డర్లను పొందాలని సూచించారు. ఈనెల 23 నాటికి కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఇతర వివరాల కోసం www.deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 26,442 మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు 20,609 మంది ధ్రువపత్రాల పరిశీలన కోసం హాజరయ్యారని వివరించారు. కన్వీనర్‌ కోటాలో 3,830 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొదటి విడతలో 1,705 సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. రెండో విడతలో 1,734 మందికి సీట్లు కేటాయిస్తే 838 మంది చేరారని వివరించారు. 309 మంది కన్వర్షన్‌ అయ్యారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లోని పది డైట్‌ కాలేజీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -