నవతెలంగాణ-హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Council of Higher Education – TGCHE) శుభవార్త అందించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను TG Ed.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ – B.Ed) , TG P.E.CET-2025 (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – B.P.Ed, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ – D.P.Ed) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన అడ్మిషన్స్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. TGCHE చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్‌లు ప్రొఫెసర్ ఇ. పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్, సెక్రటరీ ప్రొఫెసర్ ఎస్. వెంకటేష్, కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగ రెడ్డితో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని కౌన్సెలింగ్ తేదీలపై చర్చించారు.