Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డా.బసవలింగ అవధూత జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

డా.బసవలింగ అవధూత జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : డా. బసవలింగ అవధూత గారి జన్మదిన వేడుకలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొని శనివారం గురువుకు పూలమాల సమర్పించి దర్శనం చేసుకోని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని ఝరా సంఘం వద్ద గల మల్లియగిరిలో ఆశ్రమంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ.. ప్రతి ఏటా గురువు వారి దర్శనం కొరకు ఆశ్రమం వచ్చి స్వామీజీ దర్శనం చేసుకోవడం ఆశీర్వచనాలు తీసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంటుందని, మనసుకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. శ్రీ అవధూత డా” బసవలింగ గురువుగారి దర్శనం చేసుకోవడం వల్ల జుక్కల్ మండల రైతులకు కార్మికులకు పంటలు బాగా పండాలని దిగుబడి మంచి రావాలని ఆశీర్వదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -