Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర కేబినెట్ నిర్ణయం హర్షనీయం..

రాష్ట్ర కేబినెట్ నిర్ణయం హర్షనీయం..

- Advertisement -

42 శాతం బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
నవతెలంగాణ – బెజ్జంకి
: కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేలా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఏఐసీసీ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందడుగు వేయడం బీసీ సామాజిక వర్గానికి దక్కిన అరుదైన గౌరవమని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు మిట్టపెల్లి చెన్నారెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బ్లాక్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీనివాస్, నాయకులు అక్కరవేణీ పోచయ్య, బైరి సంతోష్, పోతిరెడ్డి మధు సూధన్ రెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -