Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎక్స్ఎల్ కు పలు పాఠశాలలు ఎంపిక..

ఏఎక్స్ఎల్ కు పలు పాఠశాలలు ఎంపిక..

- Advertisement -

ఎంపికైన పాఠశాలల్లో ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం
నవతెలంగాణ – బెజ్జంకి
: మండల కేంద్రంతో పాటు బేగంపేట,కల్లేపల్లి,గుండారం, రేగులపల్లి, వడ్లూర్ గ్రామాల్లోని మండల పరిషత్ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏఎక్స్ఎల్ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. ఎంపికైన పాఠశాలల్లో బీఎస్ఎన్ఎల్ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్టు ఉపాధ్యాయులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్ లెర్నింగ్ అధారితంగా చదవడానికి సహాయపడుతుందని ఉపాధ్యాయులు వెల్లడించారు.

చీలాపూర్ పాఠశాలకు మళ్లీ మొండిచెయ్యి.. మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయింది. నూతన పాఠశాల భవనం మంజూరీ చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. పాఠశాలను ఏఎక్స్ఎల్ కార్యక్రమంలో ఎంపిక చేయకపోవడం మళ్లీ మొండిచెయ్యి చూపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి. -రావుల రాజు, బీఆర్ఎస్ నాయకుడు, చీలాపూర్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -