– ఇప్పటికే 50 సార్లు రక్తదానం
నవతెలంగాణ – కోహెడ
అత్యవసర సమయంలో రక్తం అందకపోతే ఆ బాధితుల విచారం మాటల్లో చెప్పలేము. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులే రక్తదానం చెసేందుకు ముందుకు రాక ఇబ్బందులను ఎదుర్కోంటున్న నేటి పరిస్థితులలో దానికి భిన్నంగా శ్రావణ్ అండగా నిలుస్తున్నాడు. మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల శ్రావణ్ ఆపదలో రక్తం అవసరమని తెలిస్తే చాలు వెంటనే ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాడు.
32 ఏళ్ల వయసున్న ఆయన ఇప్పటికే 50 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపాడు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకోవడంతో ఉన్న తృప్తే వేరన్నారు. శనివారం కోరుట్ల జిల్లాకు చెందిన బౌరే అనురాధ ఆక్సిడెంట్‌కు గురై కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆమెకు బీ-పాజిటీవ్ బ్లెడ్ అవసరమని సోషల్ మీడియాలో చూసిన వెంటనే శ్రావణ్ స్పందించి రక్తదానం చేశాడు. ఆపదలో ఉన్నారని తెలిస్తే తన స్వంత డబ్బులతో వెళ్లి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఆపదలో అండగా నిలుస్తున్న శ్రావణ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES