Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేయండి

ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేయండి

- Advertisement -

ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే ధన్ పాల్ సూచన
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షుడిగా గెలుపొందిన ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా తమ ప్యానల్ సభ్యులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు.. ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని వారికి సూచించారు. గెలువడమే కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

అనంతరం ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన, ఎన్ని కుట్రలు చేసిన చివరికి ధర్మమే గెలిచిందన్నారు. ఈ గెలుపు తన ఒక్కరిది కాదని తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన సంఘం పెద్దలు తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరి విజయంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఇంగు శివప్రసాద్, పాల్డి రవికుమార్, ఇల్లందుల సుధాకర్, లిఖిత్, వివేకానంద, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -