ఎస్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : విద్యా ప్రమాణాలు పెంచడం మా బాధ్యత అని ఎస్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్టేట్ టీచర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పెన్షనర్ భవన్ లో ఏర్పాటు చేసిన సర్వీస్ రూల్స్ అంశాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిధులుగా హాజరైన సందర్భంలో మాట్లాడుతూ.. ఎస్ టి యు హక్కులకోసమే పోరాటం చేస్తూ,బాధ్యత విషయంలో కూడా ముందు ఉంటుంది అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని,నాణ్యత తో కూడిన విద్యను అందించి విద్యార్ధుల భవిష్యత్తుకు కృషి చేయాలనుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఏం ఎల్ సి కత్తి నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని, విద్యావ్యవస్థను బలోపేతం చేయవలసిందిగా కోరారు. ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యా శాఖాధికారి అశోక్ ఎస్ టి యు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని అన్నారు.
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి . ఏ వి సుధాకర్ వివిధ అంశాలపైన వున్న పెన్షన్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గజేందర్, పరమేశ్వర్, బెల్లాల్ శ్రీనివాస్, ఆ.శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ , కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్మన్, జిల్లా కార్యవర్గ సభ్యులు , మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచడం మా బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES