Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణం

కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణం

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్: ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నరసింగపల్లిలో..శని వరం శ్రవణ నక్షత్రం సందర్భంగా దేవదేవుడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగ జరిగింది. వేద పండితులు సంపత్ కుమారాచార్య, ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని 9 మంది జంటలు కర్తలుగా ఉండి జరిపించడం జరిగింది. వందలాది మంది భక్తులు శ్రీవారి కల్యాణాన్ని చూసే భాగ్యాన్ని పొందినారు. అనంతరం స్వామి వారి తదియారాధన అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు నరాల సుధాకర్, నర్సారెడ్డి, రామ్మోహన్, సాయిలు, భాస్కర్, మురళి, పృథ్వీ, విజయ్ స్వామి, అనిల్ స్వామి, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -