Sunday, July 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రతీ నాయకుడు నైతిక విలువలు కలిగి ఉండాలి..

ప్రతీ నాయకుడు నైతిక విలువలు కలిగి ఉండాలి..

- Advertisement -

స్లేట్ స్కూల్ విద్యార్థులకు నాయకత్వంపై అవగాహన కలిగించిన జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్..
నవతెలంగాణ – జన్నారం
: ప్రతి నాయకుడు నైతిక విలువలను కలిగి ఉండాలని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్లేట్ ప్రయివేటు పాఠశాలలో విద్యార్థులకు స్ఫూర్తిదాయక నాయకత్వం అనే అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పౌరాణిక స్థాయిలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీ విద్యార్థుల్లో నాయకత్వ చైతన్యానికి నూతన దిక్సూచిగా నిలుస్తుంది అన్నారు.

స్లేట్ స్కూల్ విద్య, నైతికత, సామాజిక బాధ్యతలను సమన్వయపరిచే వేదికగా మారిందన్నారు. “నాయకుడు నైతిక విలువలు కలిగి ఉండాలి. మాతృభాషపై పట్టు సాధించడం ద్వారా ఇతర విషయాలపై పట్టు పెరుగుతుందన్నారు. భవిష్యత్ నాయకులు భాషా గౌరవం, సామాజిక బాధ్యతను అలవరచుకోవాలన్నారు. అనంతరం ఎస్సై గొల్లపల్లి అనూష  మాట్లాడుతూ .. “ఈ యువతే రేపటి నాయకులు. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి మూలం. నాయకత్వం అనేది పదవిని ధరించడమే కాదు, బాధ్యతను సజీవంగా నెరవేర్చడమే నిజమైన ఘనత” అంటూ విద్యార్థులను ఉత్తమ మార్గంలో నడిపేలా ఉద్వేగభరితంగా చాటి చెప్పారు.

ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ డా. ఎ. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “స్కూల్ లక్ష్యం పాఠ్య విజ్ఞానాన్ని మించి, సమాజానికి సేవ చేసే బాధ్యతాయుత నాయకులను తీర్చిదిద్దడమే. నేడు నియమితులైన విద్యార్థులంతా క్రమశిక్షణ, సేవా దృక్పథంతో, నైతికతను ఆశ్రయంగా చేసుకొని నడవాలి” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్లేట్ గ్రూప్ ఆఫ్ ఫౌండర్   ఏనుగు సుభాష్ రెడ్డి,  స్లేట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి షిరిన్ ఖాన్  స్లేట్ ఎక్స్ లెన్స్ ప్రిన్సిపాల్ శ్యామ్‌లాల్ , స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్  ఏ.రజిత రెడ్డి, కృష్ణ  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -