Sunday, July 13, 2025
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకై ఉద్యమిద్దాం 

వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకై ఉద్యమిద్దాం 

- Advertisement -

8 కోట్ల కూలీలను ఉపాధికి దూరం చేసిన బీజేపీ
వ్యకాస మండల, డివిజన్ మహాసభలను సన్నద్ధం కావాలి
ప్రజా ఉద్యమాల్లో కూలీలు భాగస్వామం కావాలి 
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – వైరాటౌన్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తూ సంవత్సరం, సంవత్సరం నిధులు తగ్గించుకుంటూ రైతు కూలీలకు ఆర్థికంగా అన్యాయం చేస్తున్నారని, ఉపాధి చట్టాల పరిరక్షణ కోసం వ్యవసాయ కార్మికులు రైతు కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం వైరా నియోజకవర్గం వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం వైరా పట్టణంలోని  బోడెపూడి భవనంలో వ్యవసాయ కార్మిక  జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. 

ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను వామపక్ష ఎంపీల మద్దతుతో, వ్యవసాయ కూలీల పోరాటాలతో చట్టం సాధించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పార్లమెంటులో ఉపాధి హామీ చట్టం ఆమోదించబడిందని,  ఆనాడు ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించే విధంగా అమలు చేశారని తెలిపారు.

కానీ నేడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  సంవత్సరం, సంవత్సరం క్రమంగా బడ్జెట్ తగ్గిస్తూ 2025 సంవత్సరానికి గాను కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి క్రమంగా నిధులు తగ్గించడం, ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో జాబు కార్డు ఉన్న రైతు కూలీలు ఉపాధికి దూరం అవుతున్నారని, పని దినాలు తగ్గిపోతున్నాయని, 8 కోట్ల మంది కూలీలు ఉపాధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా జాతీయ ఆదాయానికి కూడా జీడీపీ తగ్గుతున్నదని, కీలకంగా గ్రామీణ ప్రాంతంలో వస్తువు వినియోగం జరగాలంటే దేశంలో 40 కోట్ల మంది ఉన్న వ్యవసాయ కూలీలకు పని కల్పించాలని అన్నారు.

వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పనకు బడ్జెట్  కేటాయించని బిజెపి ప్రభుత్వం మరోవైపు కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు రాయితీలు ఇస్తూ దేశ సంపదను కట్టబెడుతున్నారని,  సంపన్నులు కట్టవలసిన పనులను రద్దు చేయడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిశ్రమలను ప్రైవేటీకరించడం, కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఇస్తూ నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన నిర్వహించే చైతన్యవంతమైన పోరాటంలో ప్రజలు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీలు వేయాలని, మండలం, డివిజన్ మహాసభలను సన్నద్ధం కావాలని, గ్రామ స్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలని, రాబోయే కాలంలో విస్తృతంగా నిర్వహించే ప్రజా ఉద్యమాలలో వ్యవసాయ కూలీలను కీలకంగా భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తాళ్లపల్లి కృష్ణ, తూము సుధాకర్, గుమ్మా నరసింహారావు, బదావత్ శ్రీనివాసరావు, రామచంద్రయ్య, ప్రసాద్, జాన్ పాపయ్య,  పోడు గిరిజన నాయకురాలు అరుణ, సిఐటియూ జిల్లా నాయకులు సుంకర సుధాకర్, చెరుకుమల్లి కుటుంబరావు, బాజోజు రమణ, యనమద్ది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -