Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలి 

అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలి 

- Advertisement -

డాక్టర్ రవీందర్ నాయక్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర సంచాలకులు
నవతెలంగాణ – గోవిందరావుపేట 
: వైద్య సిబ్బంది వర్షాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సంచాలకులు, డాక్టర్ రవీందర్  నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అందులో పనిచేస్తున్న సిబ్బంది యొక్క హాజరు, ఫార్మసీ ,ల్యాబ్, లేబర్ గదిని పరిశీలించారు. వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి, దోమలు నివారణ, ముందస్తు ప్రణాళిక గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర నాయక్  మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు. వీరితోపాటుగా ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు , ప్రోగ్రాం ఆఫీసర్ , గోవిందరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి చంద్రకాంత్  మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -