Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జంబి హనుమాన్ ఆలయంలో అన్నదానం..

జంబి హనుమాన్ ఆలయంలో అన్నదానం..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో  శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ రేగుల్ల సత్యనారాయణ, డైరెక్టర్ దోండి రమణలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజురోజుకీ భక్తుల సంఖ్య పెరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాతలు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందిస్తున్నందు వలన తాము కూడా తమ వంతు సహాయంగా ఇట్టి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఆలయానికి మరింత అభివృద్ధి చేసి అహ్లాదకరమైన వాతావరణంలో మందిర నిర్మాణానికి కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో మరింత ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు.

రానున్న రోజుల్లో మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, అలాగే చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా ప్రతి శనివారం, మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నందుకు వారు కోరిన కోరికలు తీరుతున్నందున అధిక సంఖ్యలో వస్తున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ప్రతి శని, మంగళవారాల్లో సాయంత్రం భజన  కార్యక్రమం, అల్పాహారం ఉంటుందని తెలిపారు. ఈ సోమవారం నుండి ప్రతిరోజు సంధ్య దీపా రాధన కార్యక్రమం ఉంటుందని భక్తులు ఎవరైనా దాతలుగా ముందుకు వచ్చి నూనె మొదలగు వస్తువులు బహుకరించిన వారికి వారి గోత్రనామాలతో ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కాల నవీన్, నారాయణరెడ్డి, పింజా అభినవ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -